calender_icon.png 19 October, 2024 | 6:25 AM

రాగి పాత్రలు మెరవాలంటే!

19-10-2024 12:00:00 AM

ప్రతి ఒక్కరి ఇంట్లో రాగి పాత్రలు ఉంటాయి. ముఖ్యంగా పూజా కార్యక్రమాల్లో వీటిని ఎక్కువ ఉపయోగిస్తారు. రాగి బిందెలు, రాగి చెంబులు, రాగి బాటిల్స్‌లో నీరు తాగడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే రాగి పాత్రలు తొందరగా రంగు మారతాయి. వీటి క్లీనింగ్ కూడా చాలా కష్టమైన పని. చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల రాగి పాత్రలను ఈజీగా మెరిపించొచ్చు. 

8పెరుగు, ఉప్పు: పెరుగులో కొద్దిగా ఉప్పు కలిపి రాగి పాత్రపై రాయాలి. ఇలా రాసిన పాత్రను 15-20 నిమిషాలు వదిలి పెట్టాలి. తర్వాత మెత్తని గుడ్డతో రుద్ది కడగాలి. కావాలంటే నిమ్మరసం కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రాగి పాత్రలు మెరుస్తాయి. 

8బియ్యపిండి, పసుపు: బియ్యపిండిలో కొద్దిగా పసుపు వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను పాత్రపై అప్లు చేసి 15-20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత మెత్తని గుడ్డతో రుద్ది కడగాలి. ఇలా చేయడం ద్వారా రాగి పాత్రలు తళ తళ మెరుస్తాయి. 

8వెనిగర్: వెనిగర్‌ను నీళ్లతో కలిపి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఈ మిశ్రమాన్ని పాత్రపై స్ప్రే చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత మెత్తని గుడ్డతో రుద్ది కడగాలి. వెనిగర్ రాగిపై ఉన్న నల్లటి పొరను సులభంగా తొలగిస్తుంది. 

8టమాటో: టమాటో ముక్కను రాగి పాత్రపై రుద్ది.. ఒక 15-20 నిమిషాల పాటు గాలికి ఆరనివ్వాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి. టమాటోలో ఉండే యాసిడ్ రాగిని మెరిసేలా చేస్తుంది. 

8సిట్రస్ పండ్లు: నిమ్మ, నారింజ లేదా ద్రాక్ష పండు తొక్కను రాగి పాత్రపై గట్టిగా రుద్దాలి. ఇలా రుద్దిన తర్వాత రాగి పాత్రను 10-15 నిమిషాలు గాల్లో ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగితే సరిపోతుంది. సిట్రస్ పండ్లలో ఉండే సిట్రిక్ ఆమ్లం రాగి పాత్రను మెరిసేలా చేస్తుంది.