03-03-2025 07:57:20 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి సోమవారం మహిళా నాయకురాలు అత్తి సరోజ, మల్లయ్య దంపతులు రాగి బిందెను విరాళంగా అందజేశారు. భక్తుల సౌకర్యార్థం ఉప్పరి సత్యనారాయణ దంపతులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నదాన ట్రస్ట్ అధ్యక్షురాలు మాసాడి శ్రీదేవి శ్రీరాములు, డైరెక్టర్లు ములుకూరి బాలకృష్ణ, జిల్లపెల్లి స్వరూప, సుంకరి రాజేశం, మిట్ట చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.