calender_icon.png 25 December, 2024 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీర్మానం ప్రతులు కలెక్టర్‌కు అందజేత

24-12-2024 11:08:11 PM

కరీంనగర్ సిటీ, డిసెంబర్ 24: కార్పొరేష న్‌లో 5గ్రామాలు, కొత్తపల్లి మునిసిపాలిటీ నీ  విలీనం చేయడాన్ని నగరపాలక సంస్థ లో  వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానం ప్రతులను మంగళవారం కలెక్టరేట్ అడిటోరియంలో  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నగర్ మేయర్‌వై సునీల్ రావులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం చట్ట సభలో ప్రవేశపెట్టిన విలీనం ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కలెక్టర్ వివరించారు. 

విలీన ప్రతిపాదన పై నగరపా లక సంస్థ సర్వ సభ్య సమావేశంలో  పాలక వర్గ సభ్యులు వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మా ణంపై ప్రభుత్వానికి పంపాలని కోరారు. ప్రజా అభిప్రాయాలను గౌరవించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. విలీన ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.