calender_icon.png 10 October, 2024 | 4:56 PM

సంపన్న దేశాల్లో కాప్-29 గుబులు

10-10-2024 01:13:59 AM

క్లుమైట్ ఫైనాన్స్ నిబంధనే కారణం

పేద దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్ల సాయం

15 ఏళ్లలో ఒకేసారి చెల్లించిన పెద్దదేశాలు

పారిస్, అక్టోబర్ 9: ఈ ఏడాది నవంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు అజర్‌బైజాన్‌లో ని బాకు నగరంలో ఐక్యరాజ్యసమితి క్లుమైట్ చేంజ్ కాన్ఫరెన్స్ (కాప్-29) జరగనుంది. ఈ నేపథ్యంలో ధనిక దేశాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇందుకు కారణం క్లుమైట్ ఫైనాన్స్. దీనికి కచ్చితమైన నిర్వచనం లేదు.

పారిస్ ఒప్పందంలో ఉపయోగించిన దాని ప్రకారం గ్రీన్‌హౌస్ ఉద్గారాలు, శీతోష్ణస్థితి స్థితిస్థాపక అభివృద్ధి కోసం చేసే ఖర్చు అని పేర్కొన్నారు. అంటే సోలార్, పవన విద్యుత్ వంటి క్లీన్ ఎనర్జీ కోసం ఖర్చు చేయాల్సిన డబ్బుగా పరిగణించవచ్చు. ఈ మొత్తా న్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధనిక దేశాలు అందివ్వాల్సి ఉంటుంది. 

ధనిక దేశాలదే బాధ్యత

1992 ఐరాస ఒప్పందం ప్రకారం గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే కొన్ని సంపన్న దేశాలు ఆర్థిక సాయం చేయడానికి ముందు కు వచ్చాయి. 2009లో అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్, బ్రిటన్, కెనడా, స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా 2020 నాటికి ఏటా 100 బిలియన్ డాలర్లు చెల్లిస్తామని అంగీకరించాయి. కానీ దీన్ని ఒకసారి అదీ 2022లో మాత్రమే పాటించారు.

దీంతో పర్యావరణ పరిరక్షణ అంశంలో ధనిక దేశా ల వైఖరిపై విశ్వాసం సన్నగిల్లింది. ధనిక దేశాలే ఈ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నాయనే ఆరోపణలకు ఈ ఆలస్యం ఆజ్యం పోసింది. భారత్ కూడా ఏడాదికి 1 ట్రిలియ న్ డాలర్లు సాయంగా అందించాలని కోరుతోంది. కానీ ఆ డబ్బులు అందించే సంపన్న దేశాలు మాత్రం సందిగ్ధంలో ఉన్నాయి.

1990లలో పెద్ద పారిశ్రామిక దేశాలుగా ఉన్న తమ నుంచి ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 30 శాతం ఉద్గారాలు మాత్రమే విడుదలవుతున్నాయని వాదిస్తున్నాయి. ఉదాహరణకు ప్రపంచంలో అతిపెద్ద కాలుష్యకారిణి చైనా, గల్ఫ్ దేశాలు ఈ ప్రతి పాదనలకు అంగీకరించడం లేదు. 

గ్రాంట్ రూపంలోనే సాయం

2030 నాటికి చైనా మినహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏటా 2.4 ట్రిలియన్ డాలర్లు అవసరమవుతాయి. కానీ క్లుమైట్ ఫైనాన్స్, విదేశీ సాయం, ప్రైవేట్ పెట్టుబడు లు విషయంలో అస్పష్టత నెలకొంది. ఎవ రు, ఏ విధంగా చెల్లిస్తారనే అంశంపైనా వివాదముంది. ప్రస్తుతం ఇలాంటి నిధులు అభి వృద్ధి బ్యాంకులు లేదా సహకార దేశాల సేకరించిన నిధుల ద్వారా అందుతున్నాయి.