calender_icon.png 23 November, 2024 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిటిపిఎస్ ఉద్యోగుల సీనియార్టీలో సమన్యాయం

22-11-2024 07:45:26 PM

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బీటీపీఎస్ కర్మాగారంలో ఉద్యోగులకు సీనియార్టీలో అందరికీ సమన్యాయం చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ టీజీ జెన్కో విద్యుత్ సౌదాలోజెన్కో డైరెక్టర్ (హెచ్ఆర్) అజయ్ ని కలిసి భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఉద్యోగుల సమస్యలను తెలిపారు. గత ప్రభుత్వంలో భూమి కోల్పోయిన ఉద్యోగ నియామకంలో కొందరి స్వార్ధ రాజకీయాల వలన కొంతమంది భూ నిర్వాసిత ఉద్యోగస్తులను మానసికంగా ఇబ్బందులకు గురిచేశారన్నారు.

ఇప్పుడు వారి ఉద్యోగనియామకంలో ఎటువంటి కారణాలు చూపకుండా 30 రోజులపాటు ఆపి, మరల ఉద్యోగ నియామకాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దానివలన సీనియార్టీలో వారికి అన్యాయం జరుగుతుందని తనను కలిసి తెలిపారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వివరించారు. ఈ విషయంపై స్పందించిన డైరెక్టర్ అజయ్ సీనియార్టీ విషయంలో భూనిర్వాసిత ఉద్యోగులందరికీ సమన్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిటిపిఎస్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.