calender_icon.png 19 April, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతల మధ్య సమన్వయం తప్పనిసరి

19-04-2025 12:00:00 AM

  1. పార్టీ కోసం కష్టపడిన వారికే గుర్తింపు
  2. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 
  3. చేవెళ్ల, జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గాల సమీక్షలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ 
  4. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు 
  5. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ 

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): పార్టీలో కష్టపడిన వారికి తప్పకుండా న్యా యం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నా రు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి వచ్చాక బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య సమన్వ యం కోసం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, తాను కలిసి కృషి చేస్తామని చెప్పారు.

శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన చేవెళ్ల, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలపై రివ్యూ, పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించారు.

అయితే చాలా మంది నాయకులు పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని, అప్పుడే పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం వస్తుందని, తద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ఆస్కారం ఉంటుం దని అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్మాణపరంగా బలంగా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు వివరించారు.

ప్రభు త్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్నా నామినేటెడ్ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయక పోవడం వల్ల పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు క్యాడర్‌లోనూ నిరుత్సాహం నెలకొందనే విషయాన్ని వివిధ నియోజకవర్గాల నాయకులు వెల్లడించారు. అనంతరం మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు ఉం టుందని హామీఇచ్చారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వ యంతో పని చేయాలని, పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఐసీసీ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు.

సమీక్షా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథన్, మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, మాజీమంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీశ్, కేఎల్‌ఆర్, భీమ్ భరత్‌తో పాటు డీసీసీ అధ్యక్షులు, పార్టీ నియోజక వర్గాల ఇన్‌చార్జులు పాల్గొన్నారు.