జొన్న పంట తరలించేందుకు సహకార సంఘం అధికారులు చర్యలు చేపట్టాలి
27-05-2026 03:25 PM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మార్కెట్ పరిధిలో కొనుగోలు చేస్తున్న జొన్న పంటను త్వరితగతిన తరలించేందుకు సహకార సంఘం అధికారులు తమ చర్యలు చేపట్టాలని సోమల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల పోతన్న అధికారులను కోరారు. జొన్న పంట కొనుగోలు చేసిన తర్వాత పంటను తొలగించే బాధ్యత అధికారుల దేనని కానీ రైతులను అధికారులు జొన్న పంట లారీల్లో ఎక్కించేంతవరకు బాధ్యులుగా చేయడం సరికాదన్నారు.
పంటను తూకం వేసిన రైతులు మాత్రం రాత్రి పగలు కాపలాగా ఉండాల్సి వస్తుందని వాపోయారు. ఒకవైపు ఖరీఫ్ కాలం దగ్గర పడడంతో రైతులు పొలాలకు వెళ్లలేక ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. సాధ్యమైనంతవరకు లారీలను రప్పించి బస్తాలను పంపించేలా చూడాలని కోరారు. రైతులు లారీల కొరత ఉందనే విషయాన్ని గమనించి సహకరించాలన్నారు






