28-03-2025 12:47:43 AM
జిల్లా సహకార అధికారి శంకరా చారి
మహబూబ్ నగర్ మార్చి 27 (విజయ క్రాంతి) : కుల వృత్తులకు జీవం పోస్తూ ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వాలంబన అందించాలని సంకల్పంతోనే సహకార సంఘాలు ఆవిష్కృతం కావడం జరిగిందని జిల్లా సహకార అధికారి శంకరా చారి అన్నారు. గురువారం అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగాఎంవీఎస్ డిగ్రీ విద్యార్థులతో ఏర్పా టుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర సహకార కమిషనర్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో ఎం.వి ఎస్ డిగ్రీ కాలేజ్ నందు క్లబ్ ప్రారంభ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థులకు సహకార సంఘాల ప్రాముఖ్యత గూర్చి వివరించారు. సహకార సంఘాలు వివిధ రకాల కుల వృత్తులను బలోపేతం చేస్తూ వారి స్వయం సమృద్ధి సాధించడం లో ముందు వరుసలో నిలిచినట్లు వెల్లడించారు.
బలహీనుల బడుగు వర్గాలను ఆదుకొనుటకు, దోపిడీ నుండి దీన జనులను కాపాడుటకు, అన్న దాతలకు వృత్తి కులాలకు సహాయపడ్డ వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన సహకార సంఘాల పనితీరి గురించి తెలియజేశారు.
మహిళ పొదుపు సంఘాలను ముందుకు నడిపిన సహకార సంఘాల ప్రాముఖ్యత గూర్చి విద్యార్థుల కు తెలిపారు. ఈ సందర్భంగా సహకార ఆడిట్ అధికారి టైటస్ పాల్‌విద్యార్థులతో సహకార గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పద్మావతి, ఎన్‌ఎన్‌ఎస్ ప్రోగ్రాం అధికారి నర్సింహులు, సహకార అధికారులు వీరభద్రయ, దివ్య, నాగరాజు పాల్గొన్నారు.