calender_icon.png 6 November, 2024 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకార రంగాన్ని బలోపేతం చేయాలి

05-07-2024 01:06:32 AM

మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): భారతదేశంలో సహకార ఉద్యమం 125 ఏళ్ల నాటిదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సహకార రంగం ఈ కాలపు అవసరాలకు అనుగుణంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు.  ఇందుకోసం పీఏసీఎస్‌లను బలోపేతం చేయడం ముఖ్యమ ని, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గడిచిన 125 ఏళ్లలో సహకార సంఘాల చరిత్రను పరిశీలిస్తే రాష్ర్ట ఆర్థిక వ్యవస్థకు గర్వించదగిన తోడ్పాటును అందించాయని, రాబోయే రోజుల్లోనూ ఈ సంఘాలు భాగం కావాలని ఆకాంక్షించారు. రాష్ర్టంలో ప్రస్తు తం 60,759  సహకార సంఘాలు ఉన్నాయని, 908 పీఏసీఎస్, 24,539 వినియో గదారుల పొదుపు సంఘాలు, అనేక మత్స్య సహకార సంఘాలు ఉన్నాయని తెలిపారు.

రాష్ర్టం మొత్తం వ్యవసాయ రుణంలో సహకార రంగం వాటా 20 శాతం ఉండగా, 60 శాతం ఎరువుల పంపిణీ వాటి ద్వారానే జరుగుతుందన్నారు. హనుమకొండ జిల్లా ముల్కనూర్ దీనికి ఒక ఉదాహరణ అని తెలిపారు. సహకార రంగంలో కంప్యూటరీకరణ, ప్రజాస్వామ్య ఎన్నికలు, క్రియాశీల సభ్యత్వాన్ని నిర్ధారించడం, పరిపాలన, నాయక త్వంలోని వృత్తినైపుణ్యం, పారదర్శకత, జవాబుదారీతనం విధానాలను ప్రభుత్వం అవ లంబిస్తుందని తెలిపారు. శ్రీరాంపూర్, రాయికల్, మహదేవ్‌పూర్, అప్పన్నపేట, జీడిమెట్ల మత్స్య సహకార సంఘం ప్రతినిధులను అభినందించారు.