25-01-2025 12:00:00 AM
ఐరాస (ఐక్యరాజ్యసమితి) 2025 సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ సహకార సంఘాల సంవత్సరం’గా ప్రకటించింది. ‘సహకార సంఘాలు ప్రపంచాన్ని నిర్మిస్తాయి’ అన్న ఇతివృత్తంతో ఈ ఏడాది కొత్త సహకార స్ఫూర్తిని ఇనుమడింపజేసేలా కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా నిపుణులు పిలుపునిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కొంటున్న ఎన్నో అంతర్జాతీయ సవాళ్లను పరస్పర సహకార భావనలతో అధిగ మించడానికి ఈ ప్రత్యేక దినోత్సవ కార్యాచరణ ఉపయోగపడాలని వారు ఆకాంక్షిస్తు న్నారు. సహకార నమూనా ఒక ముఖ్యమైన పరిష్కారమని, 2030 నాటికి స్థిరాభివృద్ధి లక్ష్యాలను అమలు చేయడానికి కావలసిన అన్ని ప్రయత్నాలనూ వేగవంతం చేయాలని వారు పేర్కొన్నారు.
ఇందుకు ఈ ఏడాది కాలం ముఖ్యపాత్రను పోషించేలా అందరూ దృష్టి సారించాల్సి ఉంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2025ను ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం’గా ప్రకటించే తీర్మానాన్ని 19 జూన్ 2024న ఆమోదించింది. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సహకార సంస్థ ల సహకారాన్ని ప్రోత్సహించడానికి, ఈవెంట్స్‌ను ప్రభావితం చేయడానికి అన్ని సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి, సంబంధిత వాటాదారులకు మార్గాలను సిఫార్సు చేయడమేకాక ఆ మేరకు ప్రోత్సహించడానికి నిశ్చయించారు.
ఇది వ్యక్తిగత సహకార సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రైవేట్ రంగం, ప్రభుత్వాలు, అభిప్రాయాలను రూపొందించే వారు, బహుపాక్షిక సంస్థలను, న్యాయమైన సమాజం, సురక్షిత ప్రపంచం కోసం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కోరే కార్యాచరణ ప్రణాళికను నిర్వాహ కులు ప్రకటించారు. చరిత్ర అంతటా, అన్ని దేశాలూ కలిసిమెలిసి ఉంటూ మంచి ప్రపంచాన్ని నిర్మించడానికి అంకితం కావాలి.
గడీల ఛత్రపతి