నారాయణ్‌ఖేడ్‌లో 25వ బ్రాంచి ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (విజయక్రాంతి): ఆదర్ష్ కోఆపరేటివ్ బ్యాం కు సేవలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని బ్యాంకు చైర్మన్ మదన గోపాలస్వామి తెలిపారు. నారాయణఖేడ్‌లో స్థాని క ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదివారం ఆదర్ష్ కో ఆపరేటివ్ బ్యాంకు 25వ బ్రాంచిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గోపాలస్వామి మాట్లాడుతూ.. స్థానికుల విజ్ఞప్తి మేరకు నారాయణఖేడ్‌లో నూతన బ్రాంచి ప్రారంభించినట్టు చెప్పారు. తమ వద్ద తనఖా లేకుండా రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు గ్యారెంటీలతో రుణాలు ఇస్తామని తెలిపారు. సెక్యూరిటీ ఉంటే వారి అవసరార్థం వ్యాపార అభివృద్ధికి రుణాలు మంజూరు చేస్తామని వివరించారు.
లాకర్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాహీర్, కౌన్సిలర్లు సద్దాం, ముజీబ్‌ఖాన్, బ్యాంకు సీఈవో ఎంవీ రమణ, ఏజీఎం అప్పయ్యనాయుడు, బ్రాంచి మేనేజర్ నవీన్ దాసరి, కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.