calender_icon.png 15 November, 2024 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అణు, చమురు రంగాల్లో సహకారం

10-09-2024 04:00:34 AM

భారత్, యూఏఈ కీలక ఒప్పందాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన తొలి అధికారిక పర్యటనలో భాగంగా భారత్ పర్యటనకు విచ్చేశారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి సోమవారం అణుశక్తి, చమురు, ఫుడ్ పార్క్‌ల అభివృద్ధిపై మొత్తం ఐదు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ద్వైపాక్షిక సమావేశం అనంతరం ప్రిన్స్ రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు.

ప్రిన్స్ మంగళవారం ముంబైలో జరగనున్న బిజినెస్ ఫోరం సదస్సులో పాల్గొననున్నారు. సదస్సుకు యూఏఈ, భారత్‌కు చెందిన వ్యాపార, దౌత్యవేత్తలు ప్రాతినిధ్యం వహించనున్నారు. వాణిజ్య సంబంధాల పరంగా భారత్‌కు యూఏఈ రెండో అతిపెద్ద భాగస్వామి కావడం విశేషం. అలాగే యూఏఈకి కూడా ఇతర గల్ఫ్ దేశాలకంటే భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గడిచిన పదేళ్లలో రెండు దేశాల మధ్య 100 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య లావాదేవీలు జరగడం గమనార్హం. ఒక్క 2022 85 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక లావాదేవీలు జరగడం విశేషం.