calender_icon.png 24 February, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అదానీ’ వ్యవహారంలో సహకరించండి

19-02-2025 11:00:17 PM

భారత్‌ను కోరిన అమెరికా..

న్యూఢిల్లీ: సెక్యూరిటీల సమీకరణ విషయంలో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, అతడి మేనల్లుడు సాగర్ అదానీ అవినీతికి పాల్పడ్డారని అమెరికాలో అభియోగాలు ఎదుర్కొటుంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ కేసు విచారణలో భారత సాయం కోరినట్లు అమెరికాకు చెందిన యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా న్యూయార్క్ జిల్లా కోర్టుకు ఈ విషయాన్ని తెలిపింది. అదానీకి తమ ఫిర్యాదు అందించడానికి భారత న్యాయ మంత్రిత్వశాఖ సాయం కోరినట్టు నియంత్రణ సంస్థ వెల్లడించింది. 2020 మధ్య రాష్ట్ర విద్యుత్ సంస్థలతో సౌరశక్తి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అదానీ 265 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2029 కోట్లు) లంచం ఇచ్చినట్లు గతేడాది నవంబర్‌లో అమెరికా అభియోగాలు మోపింది.