06-03-2025 01:18:21 AM
కల్లూరు, మార్చి 5 (విజయ క్రాంతి):కల్లూరు మాజీ సర్పంచ్ పసుమర్తి పద్మావతి జ్ఞాపకార్ధం భర్త, జిల్లా కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్రావు కూలింగ్వాటర్ మిషన్ వితరణ చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు అందజేసిన దీనిని తహసీల్దార్ పులి సాంబశివుడు బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.