calender_icon.png 18 March, 2025 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్జాతో కూల్ కూల్‌గా..

02-03-2025 12:00:00 AM

రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో శరీరానికి చల్లని ద్రవ పదార్థాలను అందించడం చాలా అవసరం. లేదంటే డీహైడ్రేట్ అయి వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే సబ్జాతో ఒంట్లో వేడికి చెక్ పెట్టొచ్చు. వాటిలో ఔషధగుణాలెన్నో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

* సబ్జా వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు, సౌందర్య సంరక్షణకు బాగా పనిచేస్తాయి.

* శరీరాన్ని వేసవి తాపానికి గురికాకుండా కాపాడేందుకు పండ్లు, మజ్జిగ, లస్సీ వంటి పదార్థ్థాలతో పాటు కొన్ని గింజలను కూడా భాగం చేసుకోవాలి.

* పండ్ల రసాలు తాగేటప్పుడు వాటిలో నానబెట్టిన సబ్జాలను కలుపుకుని తాగితే ఆరోగ్యంతో పాటు వేసవి తాపానికి చెక్ పడుతుంది.

* గాలి, నీటి కాలుష్యం వల్ల చర్మం నల్లగా మారిపోతుంది. సబ్జా తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.

* ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.

* మలబద్ధకాన్ని తగ్గించడంలో, పేగుల కదలికను ప్రోత్సాహించడంలో, మూత్రపిండాల పనితీరు పెంచడంలో, రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించడం, నెమ్మదిగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

* జుట్టు ఊడిపోకుండా ఒత్తుగా పెరగడానికి కూడా ఇది తోడ్పడుతాయి.