06-04-2025 12:00:00 AM
* మజ్జిగ, సలాడ్లు, వంటకాల్లో పుదీనాని ఎక్కువగా వాడతారు. దీనివల్ల వేసవిలో చలువ చేస్తుందంటున్నారు వైద్యులు.
* ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది పుదీనా. మజ్జిగలో కలిపి తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, దాహాన్ని తీరుస్తుంది.
* వికారం, కడుపుబ్బరం, జీర్ణ సమస్యలను పుదీనా నివారిస్తుంది. దీంట్లో ఉండే డైజెస్టివ్ ఎంజైములు ఆహారం వేగంగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
* వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీన్ని అదుపు చేసేందుకు లస్సీ, చెరుకు రసంలో, షర్బత్‌లో పుదీనాని కలపొచ్చు. దీంట్లో ఉండే ఎలక్ట్రోలైట్లు తక్షణ శక్తినందిస్తాయి.
* పుదీనాలో ఉండే అరోమా భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తుంది. దీన్ని కూరల్లో వేసి ఉడికించడం కంటే డ్రింకుల్లోనూ, సలాడ్ల ద్వారా తినడమే ఉత్తమం.
* పుదీనా వాసన రిఫ్రెష్ చేస్తుంది. రక్తంలో కార్టిసాల్ స్థాయులను తగ్గిస్తుంది. తరచూ తీసుకుంటే ఒత్తిడిని నివారించేందుకు తోడ్పడుతుంది.
* చర్మానికి రక్త సరఫరాని మెరుగుపరుస్తుంది. చర్మానికి సరిపడా తేమనందిస్తుంది. చర్మ సమస్యలను తగ్గించడం, కాంతివంతంగా చేసేందుకు సాయపడుతుంది.
* పుదీనాలో మెంతాల్ స్థాయి ఎక్కువ. ఇది జలుబు, దగ్గును నివారించేందుకు తోడ్పడుతుంది.
* అధిక రక్తపోటుకు కారణమయ్యే ధమనుల పూడికను అదుపులోకి తెస్తుంది. దీంతో గుండెకి వేగంగా రక్తం అందుతుంది. తద్వారా రక్తపోటు అదుపులోకి వస్తుంది.