01-04-2025 12:51:10 AM
4 రోజులపాటు తేలికపాటి వర్షాలు
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): మండుతున్న ఎండలకు ఉక్కపోత తో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. భూ ఉపరితలం వేడెక్కడం కారణంగా రాష్ర్టంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని సోమవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మంగళవారం నుంచి నాలుగురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని, ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గుతాయని తెలిపింది. ఏప్రిల్ 4న వర్షప్రభావం తక్కువగా ఉంటుంది. ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్, వికారాబాద్ తదితర జిల్లా ల్లో వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.