16-03-2025 12:27:59 AM
కడుపు చల్లగా.. హాయిగా ఉండాలంటే.. ఈ కాలంలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో మసాలాలు.. బయటి ఫుడ్ తగ్గించి ఈజీగా, ఆరోగ్యంగా ఉండే మజ్జిగను ఇంట్లో చేసుకునే తాగితే ఆరోగ్యం కూడా.. అయితే మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం..
తయారీ: ముందుగా ఒక కప్పు చిక్కటి పెరుగును మిక్సీజార్‌లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ పెరుగు పలుచగా.. జ్యూస్‌లా అవుతుంది. దాన్ని ఒక పాత్రలోకి తీసుకుని తగినన్నీ నీళ్లు, ఉప్పు, జిలకర పొడి లేదా కారివేపాకు పొడి కలుపుకుంటే సరిపోతుంది.
లాభాలు..
* మజ్జిగ తాగడం వల్ల శరీరానికి పొటాషియం, క్యాల్షియం, ఫోలేట్, పీచు, బి1, బి9, సి విటమిన్లు అందుతాయి.
* రక్తంలో చక్కెర స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది.
* ఊబకాయం రాదు.
* జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. వేళకు ఆకలి వేస్తుంది.
* శరీరంలో చేరిన హానికరమైనవి బయటకు వెళ్లిపోతాయి.
* కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
* మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
* చర్మం పొడిబారదు.
* మానసిక ఒత్తిడి తగ్గుతుంది.