02-03-2025 12:00:00 AM
ఎండాకాలంలో ఇంటిని చల్లగా ఉంచుకోవాలంటే.. గదుల్లో అక్కడక్కడా మొక్కలను పెంచాలి. ఇవి ఎండ వేడిని తగ్గించడంతో పాటు ఇంటి లోపల ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. దీనికోసం కలబంద, స్నేక్ ప్లాంట్ లాంటి ఇండోర్ ప్లాంట్స్ ఎంచుకోవాలి. దాంతో ఇల్లు కళాత్మకంగా, చల్లగానూ ఉంటుంది.
మనీప్లాంట్
ఈ రోజుల్లో మనీ ప్లాంట్ ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. కొందరు దీనిని గుమ్మం ముందు పెంచుకుంటారు. మరికొందరు ఇంటి లోపల పెంచుకుంటారు. ఇది ఇంటికి ఆకర్షణ తీసుకువస్తుంది. మనీప్లాంట్ ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాకుండా చల్లగా మారుస్తుంది. ఇది గాలిలోని మలినాల్ని ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇంట్లో దీన్ని పెంచుకోవడం ద్వారా స్వచ్ఛమైన, తాజా గాలిని పీల్చుకోవచ్చు. అంతేకాకుండా ఇంటి వాతావరణాన్ని చల్లగా మారుస్తుంది.
స్నేక్ ప్లాంట్
స్నేక్ ప్లాంట్స్‌ను ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ మొక్కను పెంచుకుంటే బోలెడు ప్రయోజనాలున్నాయి. ఇది ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తుంది. స్నేక్ ప్లాంట్ పగటి పూట గాలిని శుద్ధి చేసి.. రాత్రి సమయాల్లో ఆక్సిజన్ విడుదల చేస్తుంది. దాంతో గాలిలోని టాక్సిన్లు తొలగిపోతాయి. అంతేకాకుండా ఇంటిని చల్లగా మారుస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గుతుంది. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.
కలబంద
చాలామంది ఇళ్లలో కలబంద మొక్కను నాటుతారు. ఆరోగ్యం కోసం చాలామంది కలబంద రసం తాగుతుంటారు. ఇలా ఆరోగ్యానికి మేలు చేసే కలబంద ఇంటి ఉష్ణోగ్రత నూ కూడా చల్లబరుస్తుంది. ఇది గాలిలోని టాక్సిన్లను తొలగించి శుద్ధి చేస్తుంది.
రబ్బరు మొక్క
వేసవిలో పర్యావరణాన్ని చల్లగా, శుభ్రంగా ఉంచడంలో రబ్బరు మొక్క సాయపడుతుంది. ఈ మొక్క వేసవిలో తేమను తగ్గిస్తుంది. రబ్బరు మొక్కకు నీరు కూడా పెద్దగా అవసరం లేదు. తక్కువ నీటితో ఇది బతికేస్తుంది. అయితే ఈ మొక్కను మంచి నేలలో, తక్కువ వెలుతురు పడే ప్రదేశంలో పెంచాలి.
ఫెర్న్ మొక్క
వేసవిలో ఇంటిని సహజంగా చల్లగా ఉంచడానికి ఫెర్న్ మొక్కలను కూడా నాటవచ్చు. ఇది గాలిలో తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. దీంతో ఇంటిని చల్లగా ఉంచుతుంది. అంతేకాకుండా పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతుంది. గాలిలో టాక్సిన్‌ను తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఇది ఇంటికి అందమైన ఆకర్షణను తీసుకువస్తుంది.