calender_icon.png 19 April, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చండుపట్ల జడ్పీహెచ్‌ఎస్‌లో వంట షెడ్ ప్రారంభం

08-04-2025 12:00:00 AM

 కల్లూరు, ఏప్రిల్ 7 :-చుండ్రుపట్ల గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు కాటమనేని రవికుమార్ (లండన్ ), కాటమనేని రమేష్ కుమార్  (లాయర్ ), కాటమనేని సంపత్ కుమార్ తాము చదువుకున్న పాఠశాలకీ నూతనంగా కిచెన్ షెడ్ ను  ఏర్పాటు చేయడంతో పాటు, పాఠశాలకు లాప్టాప్, బీరువాలను ఉచితంగా అందించారు. సుమారుగా మూడు లక్షల రూపాయలకు పైగా ,ఎల్‌ఐసి వారి సహకారంతో పాఠశాలకు అందించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్‌ఎం  బి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా  ముఖ్యఅతిథిగా కల్లూరు ఆర్డీవో రాజేంద్ర గౌడ్ హాజరై కిచెన్ షెడ్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో  దాతలను అభినందించి అందరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని, చదువుకున్న పాఠశాలకు వితరణ చేయటం ఎంతో మంచి విషయమని దాతలను అభినందించారు, పాఠశాల విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు, చుండ్రుపట్లకు  తల్లిదండ్రులకు పేరు తేవాలని ఈ సందర్భంగా విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు బాలకొండ రెడ్డి, ఎంపీడీఓ చంద్రశేఖర్, యం.ఈ. ఓ నివేదిత, ఎస్త్స్ర డి.హరిత,గ్రామ పెద్దలు కాటమనేని వెంకటేశ్వరరావు, వల్లభనేని రవి, జక్కంపూడి కిషోర్, మాజీ సర్పంచ్ గొల్లమందల ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు