calender_icon.png 20 September, 2024 | 8:21 AM

వంటగ్యాస్ తూకం చేసి ఇవ్వాలి

21-07-2024 12:00:00 AM

వంటగ్యాస్ సిలిండర్‌ను తూకం చేసి ఇవ్వడం ద్వారా వినియోగదారులకు న్యాయం చేయాలి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు సరఫరా చేసే వంటగ్యాస్ సిలిండర్లను తూకం చేయకుండానే సరఫరా చేస్తున్నారు. వాస్తవానికి వినియోగదారులకు సరఫరా చేసే సిలిండర్ బరువు 14.2 కిలోలు, అందులో నిండి ఉండే గ్యాస్ బరువు 16.4 కిలోలు, మొత్తం సిలిండర్ బరువు 30.6 కిలోల బరువు ఉండాలి. సిలిండర్ సరఫరా చేసే సమయంలో ఎక్కడ తేడాలు జరుగుతున్నాయో వినియోగదారులకూ అర్థం కాకుండా ఉ0ది. జిల్లా పౌరసరఫరా శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏజెన్సీ వారు తూకం చేయకుండానే ఇస్తున్నారు. అక్కడక్కడ సిలిండర్ ధరకన్నా అదనంగా కూడా డబ్బులు వసూలు చేస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. దీనివల్ల వినియోగదారులకూ నష్టం జరుగుతుంది. వినియోగదారులు కూడా ఇకపై తమ ఇంటివద్దకు వచ్చే డెలివరీ బాయ్స్ ను ఖచ్చితంగా తూకం చేసి ఇవ్వాలని కోరాలి. అదనంగా డబ్బులు వసూలు చేస్తే అధికారులకు పిర్యాదు చేయాలి. ఇప్పటికైనా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చిత్తశుద్ధితో వంటగ్యాస్ తూకం చేసి ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని, తూకం చేయకుండా సరఫరా చేస్తున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి.

 వావిలాల రాజశేఖర్ శర్మ, నాగర్ కర్నూల్ జిల్లా