calender_icon.png 25 March, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.1.23 కోట్లతో పాఠశాలలకు వంట సామగ్రి పంపిణీ

22-03-2025 09:55:16 PM

జిల్లాలో 1001 పాఠశాలలకు పంపిణీ చేసిన విద్యా శాఖ

అశ్వారావుపేట,(విజయక్రాంతి): పాఠశాలల్లో మధ్యాహ్నా భోజన నిర్వాహకులకు తెలంగాణా ప్రభుత్వ  రూ.1.23 కోట్లతో వంట సామాగ్రిని సరఫరా చేసింది. మధ్యాహ్న భోజనానికి సరిపడా వంట పాత్రలు లేకపోవటంతో నిర్వాహకులు తమ వద్ద పాత పాత్రలను ఉపయోగించి కొందరు ఇంటివద్దనే వంట చేస్తున్నారు. పాఠశాలల్లో తమ ఇళ్ల నుంచి తెచ్చుకున్న గంటెలు, గిన్నెలతోనే వడ్డిస్తున్నా పోయటానికి కనీసం మగ్ కూడా ఉండని పరిస్థితి. దీంతో అటు నిర్వాహకు లకు, ఇటు చిన్నారులకు ఇబ్బందులు తప్పటం లేదు. తద్వారా అనుకున్న మధ్యాహ్నా భోజన లక్ష్యం కూడా నెరవేరటం లేదు. దీంతో ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి అవసరమైన వంట పాత్రలను సరఫరా చేయాలని నిర్ణయించి గత నాలుగు రోజులుగా పాఠశాలలకు వంట సామా గ్రిని శనివారం అందించారు.

జిల్లాలో రూ.1.23 కోట్లతో 1001 పాఠశాలలకు 

పాఠశాలల్లో వంట పాత్రలు లేని పాఠశాలలకు వంట పాత్రలు అందించాలని 2022-23 విద్యా ప్రజా సంవత్సరంలో రాష్ట్ర విద్యాశాఖ వివరాలు కోరింది. మండలాల నుంచి అందిన వివరాల ప్రకారం పాఠశాలకు సామాగ్రి అవసరమో వివరాలు మండలాల నుంచి జిల్లాకు, జిల్లా నుంచి రాష్ట్రానికి అందాయి. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో సామాగ్రి సరఫరాకు టెండర్లు నిర్వ హించారు. జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద దాదాపు 1450పైగానే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నరకం అమలవుతుంది. వంట సామాగ్రి కావాలని కోరిన 1001 పాఠశాలలకు ప్రస్తుతం సామాగ్రిసి అందిస్తున్నారు. ఇందుకు రూ 123కోట్ల నిధులను వెచ్చిస్తున్నారు.

ఒక్కో పాఠశాలలో  విద్యార్థుల సంఖ్యను బట్టి 3 కిలోలు వండే గిన్నె 50 కేజీల వరకు ఆహారాన్ని వండటానికి అవకాశం ఉన్న గిన్నెలను అందిస్తున్నారు. 5,10,15,20,25,30,40,50 కిలోల వరకు వండే 8 రకాల గిన్నెలను అందించారు. వీటితోపాటు ప్రతిపాఠశాలకు నీళ్ల బకెట్, మంచి నీళ్ల జగ్, ఆహారాన్ని వడ్డించటానికి బేసిన్, కాపర్ గినెలు, వివిధ రకాల గరెటలు ఇలా తొమ్మిది రకాల సామాగ్రిని అందిస్తున్నారు. అన్నం తిప్పటానికి కుర్ఫీ  కూడా సరఫరా చేశారు. ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న సంస్థ మండలాలకు సామగ్రిని సరఫరా చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు,, మద్యాహా భోజన నిర్వాహకులు అందించారు.