12-04-2025 01:09:30 AM
టేకులపల్లి, ఏప్రిల్ 11 (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వంటగది స్లాబ్ పెచ్చులు పడి వంట మనిషికి గాయాలయ్యాయి. శుక్రవారం ఈ సంఘటన జరిగింది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన వంట చేస్తుండగా స్లాబ్ కింద మొత్తం పెచ్చులు పడిపోయి వంట మొత్తం చెడిపోయింది.
ఎండిఎం వంట మనిషి బందా సరోజ కు చేతికి గాయాలయ్యాయి. తృటిలో ప్రాణాపాయం తప్పింది. గత ప్రభుత్వ హయాంలో ఈ వంట గదికి మరమ్మతులు చేశారు. పనుల్లో నాణ్యత లోపించడంతో స్లాబ్ పెచ్చులు ఊడి కిందపడ్డాయి.