calender_icon.png 22 April, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కాన్వోకేషన్ డే వేడుకలు

22-04-2025 12:00:31 AM

మందమర్రి,(విజయక్రాంతి): మండల పరిషత్ ప్రాధమిక  పాఠశాల (ఫిల్టర్ బెడ్ పాఠశాల) లో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకున్న విద్యార్ధులకు సర్టిఫికెట్ ల ప్రధానం కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల విద్యాధికారి దత్తుమూర్తి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యా యులు పద్మజలు  విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్ లు అందజేశారు. ఈ సందర్బంగా మండల విద్యాధికారి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన జ్ఞాననిర్మాణం కోసం పరితపించి, ఉపాద్యా యులు ఎంతో కృషీ చేస్తున్నా రని, తద్వారా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని సాదిస్తున్నారని ఆన్నారు.

వినూత్న రీతుల్లో విద్యాబోధన చేస్తూ, శాస్త్రీయ పద్ధతుల్లో ప్రత్యక్ష బోధనాపద్దతుల ద్వారా మండలంలోనే అత్యధిక విద్యార్థులు ఫిల్టర్ బెడ్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారని ఈసందర్భంగా పాఠశాల  ఉపాద్యాయుల సేవలను ఆయన అభినందించారు. అనంతరం పాఠశాల ప్రత్యేకతలు, అడ్మిషన్ ల ప్రారంభం, వంటివి తెలియజేసే కరపత్రాలను ఆవిష్కరించారు. వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.ఈ సందర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు  పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపా ధ్యాయులు శ్రీనివాసాచారి, ఉపాద్యాయులు జనగామ ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్ జలంపెల్లి, చింతకింది లలిత,  రవి, అమ్మ ఆదర్శం పాఠశాల పాఠశాల చైర్మన్ దూలం అంజలి, లు పాల్గొన్నారు.