ఖమ్మం పర్యటనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, ఆక్టోబర్ 15 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలో పేదలను ఒప్పించి ఆక్రమణలు తొలగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. కూల్చివేతల సందర్భ ంగా వ్యవహరించాల్సిన విధానంపై కార్పొరేటర్లు, అధికారులకు పలు సూచనలు చేశా రు.
మంగళవారం మంత్రి తుమ్మల ఖమ్మం లో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమా ల్లో పాల్గొన్నారు. స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మా ణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంత రం మంత్రి మాట్లాడుతూ.. ఆక్రమణలను తొలగింపులో జాగ్రత్తగా వ్యవహరించాలని, పేదలకు ఎటువంటి ఇబ్బంది, నష్టం లేకుం డా కార్పొరేటర్లు, నాయకులు చొరవ తీసుకోవాలని అన్నారు.
ఆక్రమణల్లో ఉన్న పేద లకు మరోచోట పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్నేరు వరద, చెరువుల నుంచి వచ్చే వరద పట్టణాన్ని ముంచే పరిస్థితి మరోసారి రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి, వరద మళ్లింపున కు నిపుణల కమిటీ వేసి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరినట్లు చెప్పారు.
నగరం అభివృద్ధికి అవసరమైన ని ధులను సీఎంతో మాట్లాడి తీసుకువస్తానని అన్నారు. ఇదిలా ఉండగా కలెక్టర్ ముజమ్మి ల్ ఖాన్‌తో కలిసి ఖమ్మం ఉర్ధూ షాదీఖానా లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 63 మసీదులకు రూ.లక్ష చొ ప్పున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందజేశారు.
షాదీఖాన నిర్వహణ కోసం మరో రూ.50 లక్షలు మంజూరు చేస్తామని చెప్పా రు. కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చే సి షాదీఖానాను తీర్చిదిద్దుతామని తెలిపా రు. కార్యక్రమంలో మేయర్ పి.నీరజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరా వు కమిషనర్ అభిషేక్ ఆగస్త్య, నాయకులు పాల్గొన్నారు.