calender_icon.png 30 November, 2024 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనకు ప్రధానిని ఒప్పించండి

30-10-2024 02:36:00 AM

  1. బీసీ డిమాండ్ల పరిష్కారానికి చొవర చూపండి
  2. ఏపీ సీఎం చంద్రబాబుకు జాజుల శ్రీనివాస్ విజ్ఞప్తి

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాం తి): దేశవ్యాప్తంగా బీసీల డిమాండ్లను పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. బీసీ సంఘం ఏపీ అధ్యక్షుడు కేశన శంకర్రావుతో కలిసి మంగళవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. దేశంలో త్వరలో మొదలుకానున్న జనగణనలో బీసీ కులగణన జరిగేలా ప్రధాని నరేంద్రమోదీని ఒప్పించాలని విజ్ఞప్తిచేశారు. ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నిక ల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం పెంచాలని కోరారు. బీసీ రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం 50 శాతానికి పెంచాలని, రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివే యాలని కోరారు.

మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తిచేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యంత కీలక భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ తరఫున బీసీల పట్ల చొరవ చూపాలని కోరారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

ఏపీ వరద బాధితులను ఆదుకోవడానికి ఏపీ బీసీ సంఘం తరఫున రూ.10 లక్షల విరాళం చెక్కును చంద్రబాబుకు అందజేశారు. కార్యక్రమంలో బీసీ నాయకులు క్రాంతికుమార్, నాగమల్లేశ్వర్‌రావు, సరళాదేవి, సురేంద్ర, బ్రహ్మానందశర్మ, భాస్కర్, నాగరాజు, కన్నా, మాస్టర్, శ్రీనివాస్‌రావు, వెంకటేశ్వరరావు, శ్రీహరి, లింగమూర్తి, కాశీ, విజయ్, శివరాం, బాబూజీ తదితరులు పాల్గొన్నారు.