హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాం తి): 18శాతం జీఎస్టీ వసూలు వల్ల చిట్ ఫం డ్ సంస్థలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని తెలంగాణ చిట్ ఫండ్స్ ఫెడరేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీని ౫ శాతానికి తగ్గించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని గురువారం ప్రజాభవన్‌లో ఫెడరేషన్ నాయకులు భట్టిని కలిసి విజ్ఞప్తి చేశారు.
గుర్తింపు లేని సంస్థలు పెరిగిపోవడం వల్ల ప్రభుత్వామోదిత సంస్థలకు ఆదాయం సమకూరడం లేదని భట్టికి వివరించారు. రానున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తమ సమస్యను లేవనెత్తాలన్నారు డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఫెడరేషన్ చైర్మన్ రాజాజీ, ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ సుమన్, కోశాధికారి రమేశ్ ఉన్నారు.