calender_icon.png 22 September, 2024 | 5:02 PM

పండగల ప్రాముఖ్యతను భవిష్యత్తు తరాలకు తెలపండి

22-09-2024 02:24:59 PM

భక్తి శ్రద్ధలతో బ్రహ్మాండంగా  వేడుకలు జరుపుకోవాలి 

వేడుకల నిర్వహణకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): జరుపుకుంటున్న పండగల ప్రాముఖ్యతను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్య సమాజ్ భవన్ దయానంద విద్యా మందిరంలో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు భక్తి శ్రద్ధలతో బ్రహ్మాండంగా దేవి శరన్నవరాత్రులు జరుపుకోవాలని, రానున్న దేవి శరన్నవరాత్రులను ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

మొన్న జరిగిన వినాయక చవితి పండుగను ఎంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందో అదే స్పూర్తితో రానున్న దసరా నవరాత్రులను అంతే ఘనంగా జరుపుకుందామని, ఉత్సవాల యొక్క పవిత్రత కు ఏమాత్రం భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు.  ఏ ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయ ప్రమేయం, జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే సంప్రదాయాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఉత్సవాలు నిర్వహణ ఖర్చులు నిమిత్తం మున్సిపల్ కౌన్సిల్ నుంచి రూ. 3 లక్షలు, తాను రూ.50వేల  అందజేస్తానని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డాక్టర్.మురళీధర్ రావు, రవికుమార్, మోహన్ యాదవ్, కే.రామచంద్రయ్య, బురుజు సుధాకర్ రెడ్డి, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, జి నాగేశ్వర్ రెడ్డి, రామాంజనేయులు, గౌలి వెంకటేష్, బుట్ట వేద వ్రత్, ముత్యం స్వామి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.