25-03-2025 01:31:46 AM
సానుకూలంగా స్పందించిన నితిన్ గడ్కరీ
అందోలు, మార్చి 24: అందోలు నియోజకవర్గంలోని మలుపులు లేని రోడ్డుగా పేరుగాంచిన అల్లాదుర్గం- మెటల్ కుంట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించి పునర్నిర్మించాలని జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్ గుప్త కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రినితిన్ గడ్కరీని కోరారు.
సోమవారంనాడు మాజీ ఎంపీ బీబీ పాటిల్ సూచన మేరకు.. ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో జోగినాథ్.. నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలిపే ఈ రోడ్డు పై ప్రతినిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయని ఆయన నితిన్ గడ్కరీకి వివరించారు.
మహారాష్ట్ర రాజధాని ముంబై ని కూడా ఈ దారి కలుపుతుందన్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ రోడ్డు ఇటీవల పూర్తిగా ధ్వంసమైందని కేంద్ర మంత్రితో పేర్కొన్నారు.. గంగా జోగినాథ్ చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్న నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.