calender_icon.png 29 December, 2024 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్మోహన్ మెమొరియల్ ఘాట్పై వివాదం

28-12-2024 10:16:00 AM

న్యూఢిల్లీ: మన్మోహన్ సింగ్ మెమొరియల్ ఘాట్(Manmohan Singh Memorial Ghat)పై వివాదం నెలకొంది. అంత్యక్రియలు జరిగే ప్రదేశంలోనే మెమొరియల్ నిర్మించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీకి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే(AICC Chief Mallikarjun Kharge ) లేఖను భారతీయ జనతా పార్టీ తప్పుబట్టింది. పీవీ నరసింహారావు(P. V. Narasimha Rao)కి కనీసం ఢిల్లీలో అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు కదా అని బీజేపీ కాంగ్రెస్ ను ప్రశ్నించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక చిహ్నాల్లో ఎలాంటి రాజకీయ వివాదాలకు తావులేకుండా చూడాలని సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధ్యక్షురాలు మాయావతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయిస్తామని, ఆయన కుటుంబానికి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమాచారం అందించామని హోం మంత్రిత్వ శాఖ(Union Home Ministry) ఒక ప్రకటనలో హామీ ఇచ్చింది. దీంతో వివాదం సద్దుమణిగింది. భారతదేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, రాజకీయాల కఠినమైన ప్రపంచంలో ఏకాభిప్రాయ నిర్మాత మన్మోహన్ సింగ్ గురువారం అర్థరాత్రి ఢిల్లీలోని AIIMSలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌(Nigambodh Ghat)లో ఉదయం 11.45 గంటలకు నిర్వహించనున్నారు.