- భగ్గుమన్న బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకులు
- మాట వెనక్కు తీసుకున్న రాజేందర్‌రావు
కరీంనగర్, జూలై 8 (విజయక్రాంతి): కరీంనగర్ సిటీ పేరును అంబేద్కర్ సిటీగా మార్చాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకులు ఖండించారు. సోమవారం బీఆర్‌ఎస్ నేత మహ్మద్ జమీలుద్దీన్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో రాజేందర్‌రావు దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నంచగా పోలీసులు అడ్డుకున్నారు. అంబేద్కరిస్టులు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని జమీలుద్దీన్ ఆరోపించా రు. రాజేందర్‌రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే కరీంనగర్‌లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. తాను చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం కావడంతో వెనక్కి తీసుకుంటున్నట్లు రాజేందర్‌రావు ప్రకటించారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ది తన ఉద్దేశం కాదని, ముస్లిం మైనార్టీలు ఆందోళన చెందొద్దని చెప్పారు.