calender_icon.png 29 November, 2024 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజ్మీర్ దర్గాపై వివాదం

29-11-2024 01:19:13 AM

దర్గా కింద శివాలయం ఉంది

రాజస్థాన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి హిందూసేన

న్యూఢిల్లీ, నవంబర్ 28: ప్రఖ్యాత ఆజ్మీర్ దర్గా ప్రస్తుతం వివాస్పదంగా మారింది. ప్రస్తుతం దర్గా ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు శివాలయం ఉండేదని రాజస్థాన్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దర్గాను సంకట్ మోచన్ మహాదేవాలయంగా ప్రకటించాలని, ఈ స్థలంలో హిందువుల పూజలకు అనుమతి ఇవ్వాలని హిందూసేన చీఫ్ విష్ణుగుప్తా కోరా రు. దీనికి పలు ఆధారాలను ఆయన కోర్టు ముందు ఉంచారు. 1910లో ప్రచురితమైన హర్‌బిలాస్‌సర్దా రాసిన పుస్తకంలో దర్గా కింద దేవాలయం ఉన్నట్లు పేర్కొన్నారని ఈ మేరకు పిటిషన్‌లో వెల్లడించారు.

ఇందులో ఆజ్మీర్ దర్గా వద్ద శివుడితో అనుసంధానించే భూగర్భ సొరంగం ఉందని రాశారు. ఖ్వాజా అవశేషాలు ఈ సమాధికి దిగువన కొన్ని ఇటుకల తో కప్పిన సెల్లార్‌లో ఉన్నాయని, వీటిని పాలరాయి, రంగురాళ్లతో కప్పి ఉంచారని రాశా డు. చరిత్ర ప్రకారం సెల్లార్‌లోని ఆలయంలో మహాదేవుడి చిత్రం ఉందని పేర్కొన్నారు. 

అనేక ప్రాచీన ఆధారాలు..

మహాదేవ మందిరం, శివలింగం అక్కడి చెత్తలో దాగి ఉందని బ్రిటిష్ చరిత్రకారుడు ఆర్‌హెచ్ ఇర్విన్ రాసిన సమ్ అకౌంట్ ఆఫ్ ది జనరల్ అండ్ మెడికల్ ఫొటోగ్రఫీ ఆఫ్ ఆజ్మీర్ (1841) కూడా పేర్కొనడం గమనార్హం. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమయంలో అక్కడ మహాదేవ మందిరం ఉండేదని చెప్పారు. మరో రచయిత సర్దా రాసిన పుస్తకంలో బులంద్ ధర్వాజాలో హిందూ అంశాలను ప్రస్తావించారు. 75 అడుగుల గేట్‌వేకు ఉత్తరం వైపున హిందూ సంబంధిత ఆనవాళ్లను గుర్తించినట్లు చెప్పారు.

1192లో రెండో తరాయిన్ యుద్ధంలో ఆజ్మీర్ పెద్దభాగంగా ఉండేది. ఆ యుద్ధం తర్వాత ఆ ప్రాంతం మహ్మద్‌ఘోరీ అధీనంలోకి పోయి ంది. 1206లో ఘోరీ మరణం తర్వాత కుతుబుద్దీన్ ఐబక్‌తో బానిస వంశపాలన మొద లైంది. ఆజ్మీర్ దర్గా నిర్మాణం సుల్తాన్ ఇల్‌టుట్‌మిష్ కాలంలో ప్రారంభం కాగా మొఘ ల్ చక్రవర్తుల కాలంలో అనేక మార్పులు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టనున్నాయి.