calender_icon.png 15 April, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెర్లిన్‌లా ఉక్రెయిన్‌ను విభజిద్దామా?

13-04-2025 10:54:05 PM

అమెరికన్ అంబాసిడర్ వివాదాస్పద వ్యాఖ్యలు

మీడియాలో పెద్దఎత్తున దుమారం

వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు రెండు ప్రపంచ యుద్ధం తర్వాత బెర్లిన్‌ను విభజించినట్లుగానే.. ఉక్రెయిన్‌ను కూడా నియంత్రణ మండలాలుగా విభజిస్తే బాగుంటుంది’ అని అమెరికా స్పెషల్ అంబాసిడర్ జనరల్ కీత్ కెల్లాగ్ అభిప్రాయపడ్డారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇప్పటికే  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల అధ్యక్షులతో  చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో కీత్ కెల్లాగ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దీంతో కీత్ కెల్లాగ్ స్పందించారు. మీడియా కథనాల్లో తన వ్యాఖ్యల వక్రీకరణ జరిగిందని వాపోయారు. ఉక్రెయిన్ విభజన తన అభిమతం కాదని స్పష్టం చేశారు.