calender_icon.png 18 January, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

18-09-2024 02:10:32 AM

  1. శివసేన ఎమ్మెల్యే గైక్వాడ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు 
  2. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు

బుల్దానా (మహారాష్ట్ర), సెస్టెంబర్ 17: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి న బుల్దానాలోని శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌పై.. ఓ కాంగ్రెస్ కార్యకర్త ఫిర్యాదు ఆధారంగా.. మహారాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బుల్దానా సిటీ పోలీస్ స్టేషన్లో గైక్వాడ్‌పై పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశా రు. కాగా.. సోమవారం శివసేన ఎమ్మె ల్యే గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘ఎవరైతే రాహుల్‌గాంధీ నాలుకను నరికి తెస్తా రో వారికి రూ.11లక్షల రివార్డు ఇస్తా ము’ అని ప్రకటించారు.

రాహుల్‌గాంధీ విదేశాల్లో భారతదేశం గురించి అవహేళనగా మాట్లారంటూ గైక్వాడ్ ఆరోపించారు. అమెరికా వేదికగా.. భారత్‌లో రిజర్వేషన్ వ్యవస్థను తీసివేస్తామని రాహుల్ ప్రసంగిచారని.. ఈ మాటలు అతని నోటి నుంచి వచ్చినవి కాబట్టి అతని నాలుకను నరికి తీసుకువచ్చిన వారికి రివార్డు అందజేస్తానని గైక్వాడ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే స్పందించారు.

గైక్వాడ్.. సీఎం ఏక్‌నాథ్ షిండే దారిలో నడుస్తున్న ట్లున్నారు. దొడ్డిదారిలో సీఎం అయిన షిండే లాగే గైక్వాడ్ కూడా ఎమ్మెల్యే నుంచి మంత్రి పదవి కోసం ప్రమోషన్ పొందేందుకు ఇలాంటి వివాదా స్పద వ్యాఖ్యలు చేసి వార్లల్లో నిలవాలని అనుకుంటునారు అని విమర్శిం చారు. గైక్వాడ్ తరఫున సీఎం షిండే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.