23-04-2025 04:36:43 PM
ఏఎస్పి చిత్తరంజన్...
జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని ఏఎస్పి చిత్తరంజన్(ASP Chittaranjan) అన్నారు. జిల్లా కేంద్రంలోని డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ను స్థానిక సీఐ రవీందర్(CI Ravinder) తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఆసిఫాబాద్ పట్టణంలో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇకపై నిఘా వ్యవస్థ పటిష్టం చేసేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం అయిందని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు, ర్యాష్ డ్రైవింగ్, అనుమానిత వాహనాలను గుర్తించేందుకు ఆధునిక, ఆటోమేటిక్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.