calender_icon.png 19 April, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ వర్సిటీలపె నియంత్రణ!

19-04-2025 01:11:10 AM

  1. సంస్కరణలు సిద్ధం చేస్తున్న ఉన్నత విద్యామండలి
  2. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టె ఆలోచన

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలను తమ నియంత్రణలోకి తీసుకునేందుకు రాష్ర్టప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈమేరకు కొత్తగా హైయ్యర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ బిల్లును సిద్ధం చేసింది. ఈ బిల్లు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అసెంబ్లీ సమావేశాలప్పుడు సభలో పెట్టి ఆమోదించను న్నారు. ఆ తర్వాత కొత్త చట్టం అమల్లోకి రానున్నది.

రాష్ర్టంలో 10 ప్రైవేట్, 4 డీమ్డ్ వర్సిటీలున్నాయి. యూజీసీ ఇష్టారీతిన పలు వర్సిటీలకు ప్రైవేట్, డీమ్డ్ హోదాను కల్పిస్తుంది. మన రాష్ట్రంలో ఉండి ప్రభుత్వ నియంత్రణలో లేకపోవడాన్ని మొదటి నుంచి సర్కార్ అంసతృప్తితో ఉంది. ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల మంజూరుపై ఉన్నత విద్యామండలి, సర్కారు పలుమార్లు యూజీసీకి లేఖలు కూడా రాసింది.

రాష్ట్రానికి చెందిన విద్యుత్తు, నీటి వనరులు, ఇతర వసతులను వాడుకుంటున్నా.. ఇవి రాష్ర్ట ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో సర్కారుకు అస్సలు గిట్టడం లేదు. పైగా ఈ కాలేజీల్లో దాదాపు 20 వేల కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ సీట్లున్నాయి.

ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌కు ముందే ప్రైవేట్ వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీలు ఈ సీట్లను నింపేసుకుంటున్నాయి. ఇలాంటి అంశాలపై సర్కారు మొదటి నుంచి అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలను అదుపు చేసేందుకు కొత్త బిల్లును సిద్ధం చేస్తోంది.