పాత పెన్షన్ విధానాన్ని యదావిధిగా పునరుద్దించాలి
అఖిలభారత తపాలా రాష్ట్ర అధ్యక్షులు యు. మహేందర్
హుజురాబాద్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం శనివారం కేబినెట్ సమావేశంలో ప్రవేశ పెట్టిన భాగస్వామ్య పెన్షన్ పథకం స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేయాలనే నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూన్నాం అని రాష్ట్ర తపాలా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యు మహేందర్ అన్నారు. సోమవారం పోస్ట్ ఆఫీస్ కరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 25 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు 50 శాతం పెన్షన్ గ్యారెంటీ చేస్తున్నట్లు, సర్వీసులో మరణించిన కుటుంబాలకు 60 శాతం పెన్షన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఉద్యోగి నెలవారీ వేతనంలో 10 శాతం కోత విధిస్తూ చందా తో కూడిన పెన్షన్ పథకాన్ని రద్దు చేసే విషయాన్ని ప్రస్తావించక పోగా, స్పష్టత ఇవ్వక పోవడం విచారకరం. ఎన్పిఎస్ - యుపిస్ పెన్షన్ విధానాన్ని ఎంచుకోవడం ఐచ్ఛికo అని పేర్కొనడంలోనే అసలు మోసం బాగుందన్నారు.
1982 సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ ఉద్యోగి హక్కు. దాదాపు30 నుండి 40 సంవత్సరాల పాటు ఉద్యోగి ప్రభుత్వం తరపున నిస్వార్థ ప్రజా సేవకుడు గా పని చేస్తూ జవసత్వాలు సన్నగిల్లి ఉద్యోగి విరమణ చేసే సందర్భంలో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక భద్రతే పెన్షన్ అని, ఇది ప్రభుత్వ బాధ్యత అని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ను ప్రభుత్వానికి తెలియపరుస్తూ, ఒక్క రూపాయి చెల్లించ కుండానే సర్వీస్ ను బట్టి 50 శాతం ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.