ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డిసిసిబి చైర్మన్ కొత్తకురువ సత్తయ్య...
రాజేంద్రనగర్: రైతుల అభ్యున్నతికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డిసిసిబి చైర్మన్ కొత్తకురువ సత్తయ్య పేర్కొన్నారు. జిల్లా సహకార భవన నూతన కార్యాలయం, దుకాణ సముదాయాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బుధవారం ప్రారంభించారు. శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకుల గ్రామంలో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డిసిఎంఎస్) నూతన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సర్కారు వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, డీసీఎంఎస్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ పి.క్రిష్ణారెడ్డి, డైరెక్టర్లు, మాజీ జడ్పిటిసి నీరటి తన్వి రాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.