13-02-2025 12:37:31 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాం తి): ఐదో శక్తిపీఠంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న జోగుళాంబ దేవాలయ అభివృద్ధికి సహకరించాలని, ప్రసాద్ పథకం ద్వారా ఆలయానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను బుధవారం కలిసి ఈ మేర కు విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జోగుళాంబ శక్తిపీఠానికి ఎంతో ముఖ్యమైందని ఈ సందర్భంగా ఆమె కేంద్ర మంత్రికి తెలిపారు. జోగుళాంబ ఆలయం తో పాటు కురుమూర్తి, మన్యంకొండ, మల్దకల్ తిమ్మప్ప దేవాలయాల అభివృద్ధికీ ప్రసాద్ పథకం ద్వారా నిధులు ఇవ్వాలం టూ వినతి పత్రం అందించారు. ఎంపీ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర సాం స్కృతికశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. ఎంపీలు డీకే అరుణ, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జీ నగేష్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ తదితరులు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు.
దేశ వ్యాప్తంగా 12 కోట్ల మంది బంజారాలు ఉన్నారని, బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయింతిని అధికారికంగా నిర్వహించాలని మంత్రిని కోరినట్టు డీకే అరుణ తెలిపారు. అవసరమైతే ఈ అంశాన్ని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకువెళ్తామన్నారు.
కొన్ని రాష్ట్రాలు సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహి స్తున్నాయని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఫిబ్రవరి 15వ తేదీలోపు ఈ విష యంలో నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు వెల్లడించారు.