calender_icon.png 21 March, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి పన్నులు కట్టి మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడండి

20-03-2025 08:19:43 PM

మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు..

బెల్లంపల్లి: ఇంటి పన్నులు కట్టి బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు గురువారం ఆస్తి పన్నును వసూలు చేసేందుకు వార్డుల్లో ఇంటింటికి మున్సిపల్ సిబ్బందితో కలిసి తిరిగారు. ఇంటి ఆస్తిపన్నులు వసూలు చేశారు. ఏళ్ల తరబడి ఇంటి పన్నులు చెల్లించకుండా బకాయిలు పడ్డవారు వెంటనే పన్నులు చెల్లించాలన్నారు. మార్చి నెలాఖరులోగా 100శాతం పన్నుల వసూలుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్వో ప్రవీణ్, వార్డు ఆఫీసర్స్ రవి, రాజేశ్వరి, బిల్ కలెక్టర్ లక్ష్మణ్ లు పాల్గొన్నారు.