calender_icon.png 25 December, 2024 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంట్రాక్టర్లా..!సిండికేటుగాళ్లా..?

26-12-2024 12:00:00 AM

* గడువు ముగిసినా పనులెందుకు పూర్తి చేయడం లేదు?

* ప్రజలను ఇబ్బందికి గురిచేస్తుంటే ఏ చేస్తున్నారు?

* నేషనల్ హెల్త్ మిషన్ నియామకాలపై ఎంక్వురై చేసి వారంలో నివేదిక ఇవ్వండి

* దిశ సమావేంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, డిసెంబర్ 24 (విజయ క్రాంతి): కరీంనగర్ పార్లమెంట్ నియోజ కవర్గ పరిధిలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల్లో గడువు ముగిసినా ఎందుకు పూర్తి చేయడం లేదని, పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీం నగర్, సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ(దిశ) సమావేశం నిర్వ హించారు.

వివిధ శాఖలపై కేంద్రమంత్రి క్షు ణ్ణంగా సమీక్షించారు. ఆయా శాఖల లోటు పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కాంట్రాక్టర్లంతా సిండికేట్గా మారి తమాషా చేస్తూ ప్రజలకు ఏళ్లతరబడి ఇబ్బంది కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఇకపై చూస్తూ ఊరుకోబోమని, సిండికేట్గా మారి గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు 60సి కింద నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలని కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

కేంద్ర ప్రభు త్వం పెద్ద ఎత్తున విద్య, వైద్యశాఖకు నిధులి స్తున్నా, ప్రభుత్వ ఆసుపత్రులకు పైనలిస్తు న్నా, వాటి పనితీరు మెరుగుపర్చుకోకపో వడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చే శారు. వందల, వేల కోట్ల నిధులిస్తున్నా ఇప్ప టికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాటన్ లేదంటా రు, మందుల్లేవంటారు, ఎక్స్రే మిషన్ కరాబైందంటారు, దశాబ్దాలు మారినా స ర్కార్ ఆసుపత్రుల తీరు మారదా, పేదల కు రోగమొస్తే ఏకైక దిక్కు ప్రభుత్వ ఆసుపత్రులే కదా, వీటి తీరు మారకపోతే వాళ్లు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా, రోజు పత్రికల్లో వార్తలొచ్చినా మీరు చలించరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారాల్సిందేనని, లేనిపక్షంలో తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేషనల్ హెల్త్ మిషన్ నియామకాల్లోనూ భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, వచ్చిన ఫిర్యాదు లపై పూర్తిస్థాయిలో ఎంక్వురై చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించా రు. మోదీ ప్రభుత్వం అరులందరికీ ఉచితం గా గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ, కట్టెల పొయ్యి బాధ లేకుండా చేస్తుంటే, వందలాదిమంది పిల్లలు చదువుకునే పాఠశాలల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ వారి ఆనారోగ్యాలను దెబ్బతీ యడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిం చారు. ఇకపై కరీంనగర్, సిరిసిల్ల జిలాలల్లో ప్రయో గాత్మకంగా గ్యాస్ స్టవ్పు మధ్యాహ్న భోజనం వండిపెట్టాలని ఆదేశించారు.

ప్రభు త్వ విభాగాలకు సంబంధించి ఏ శాఖలో చూసినా కేంద్రనిధుల సపోర్టు చాలా ఎక్కు వగా ఉందని, దీన్ని ఎవరూ కాదనలేని నిజ మని అన్నారు. గ్రామీణ వ్యవస్థకు మూలా ధార మైన ఎన్నో కార్యక్రమాలకు సెంట్రల్ ఫండ్ ప్రాణం పోస్తుందని, పట్టణ ప్రాంతా ల్లోని ప్రగతి పనులకు కూడా కేంద్రం ఇచ్చే పైసలే అండా నిలుస్తున్నాయన్నారు. అన్ని శాఖల మనుగడకు కేంద్రం నిధులు ఆధార మవుతున్నాయని అన్నారు. కానీ కొందరు అధికారులు ఒంటికన్నుతో చూస్తూ కేంద్ర పథకాల అమలుపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇది బాధాకరమన్నారు.

మరిన్ని నిధులు తీసుకువచ్చి నా పార్లమెంట్ని యోజకవ ర్గాన్ని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయ డమే లక్ష్యంగా పనిచేస్తునాననని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ కింద 398 కోట్లు మంజూరు చేసినా పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని ప్రశ్నించారు. మీరు ఎంత తొందరగా యూసీ సమర్పిస్తే అంత తొందరగా మిగిలిన 70 కోట్ల నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. కొత్త రో డ్లు, పనులకు సంబంధించి అవసరమైతే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువ చ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.

కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎనెఎం ద్వారా 2022-23 ఆర్ధిక సంవత్సరానికి 7 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో 5.29 కోట్లు ఖర్చు చేశామన్నారు, ఆ నిధులు దేనికి ఖర్చు పెట్టారు ఆ వివరాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి అందే ప్రతి పైసాకు పక్కా లెక్క ఉండాల్సిందేనని అన్నా రు. గత ఐదారేళ్లుగా నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో చేపడుతున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్ర మాలు చోటు చేసుకున్నాయన్నారు.

వెంటనే గత ఐదేళ్లలో ఈ నియామకాలకు సంబం ధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎంత మందిని ఏ ప్రాతిపదికన ఉద్యోగం లోకి తీసుకున్నారనే పూర్తి వివివరాలి వ్వాలని, ఈ వ్యవహారంపూ పూర్తిస్థాయి విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఈ సమావేశంలో కరీంనగర్ నగర మేయర్ ్వ సునీల్రావు, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీపకు మార్ ఝూ, ఓఎస్డీ వంశీ, కరీంనగర్ అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్, కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.