calender_icon.png 3 February, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసిల్దార్ కార్యాలయానికి తాళం వేసి కాంట్రాక్టర్ నిరసన

03-02-2025 12:09:26 PM

ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి): తహసిల్దార్(Tehsildar Office) కార్యాలయానికి తాళం వేసి ఓ కాంట్రాక్టర్ వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయం (ZP Guest House) నిర్మాణం చేసి నాలుగు సంవత్సరాలు గడిచిన బిల్లు రాలేదంటూ ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన దానయ్య అనే కాంట్రాక్టర్(contractor) గేట్ కు తాళం వేసి నిరసన తెలిపారు. కాంట్రాక్టర్ తాళం వేయడంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు తాసిల్దార్ కార్యాలయానికి చేరుకొని కాంట్రాక్టర్ తో మాట్లాడి తాళం తీయించి పోలీస్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో నిరసన సద్దుమణిగింది. కాగా నాలుగు సంవత్సరాల క్రితం రూ.50 లక్షలతో జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని(Zilla Parishad Guest House) నిర్మించాలని.. తాసిల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో అధికారులు తనను నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని అధికారులు చెప్పడంతో అప్పులు చేసి పూర్తి చేశానన్నారు.

ఆ తర్వాత పలుమార్లు అధికారులను కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వాలని అడిగినా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు(Officers) బిల్లు ఇవ్వకపోవడంతో అప్పులు ఇచ్చినవారు ఇంటి దగ్గరికి వచ్చి  మా ఇంటికి తాళం వేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో తన కుటుంబ సభ్యులు కాపాడారన్నారు. అప్పుల బాధ తీర్చలేక తనకున్న భూమిని, ప్లాటుని అమ్మి అప్పులు కట్టిన ఇంకా పూర్తి అవ్వలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు బిల్లు అందజేసి ఆదుకోవాలని కోరారు.