07-04-2025 11:39:28 AM
హైదరాబాద్: ఖమ్మం జిల్లా నేతాజీనగర్(Netaji Nagar Khammam District)లో గుత్తేదారు హత్యకు గురయ్యాడు. మృతుడిని రవిప్రసాద్ గా గుర్తించారు. కొన్నేళ్లుగా మహిళతో రవి ప్రసాద్ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. నాలుగు నెలల క్రితం మహిళతో పాటు రవిప్రసాద్ సత్తుపల్లి నుంచి ఖమ్మం వచ్చాడు. ఆదివారం అర్ధరాత్రి ఘర్షణ జరగడంతో రవిప్రసాద్ ను మహిళ నెట్టేసింది. అదుపుతప్పి గోడకు తగిలి తీవ్రగాయం కావడంతో రవిప్రసాద్ మృతి చెందాడు. రవి ప్రసాద్ మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుత్తేదారు(Contractor) రవి ప్రసాద్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.