calender_icon.png 15 November, 2024 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మె విరమించిన కాంట్రాక్టు కార్మికులు

19-09-2024 02:00:13 AM

మంత్రి రాజనర్సింహ నుంచి సానుకూల హామీ

జీతాలకు బడ్జెట్ విడుదల

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాం తి): ఆరు నెలలుగా పెండింగ్ ఉన్న వేతనాల కోసం బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని నోటీసు ఇచ్చిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కార్మికులు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హామీతో మెత్తబడ్డారు. బుధవారం టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమా ర్.. కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులను మంత్రితో చర్చలకు పిలిపించారు. మంత్రి నుంచి సానుకూల స్పందన రావడంతో సమ్మె విరమిస్తున్నట్లు యూనియన్ నేతలు తెలిపారు.

మంత్రి వెంటనే అధికారులతో మాట్లాడి బడ్జెట్ విడుదల చేయించినందుకు యథావిధిగా విధుల్లో పాల్గొంటామని కార్మికులు తెలిపారు. ఇకపై కార్మికులకు నెల నెలా జీతాలు చెల్లించేలా చూడాలని తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్ష ప్రధా న కార్యదర్శులు ఎండీ యూసు ఫ్, ఎం నరసింహ కోరారు. వెంటనే జీతాలు విడుదల చేయించినందుకు మంత్రి రాజనర్సింహ, కమిషనర్ అజయ్ కుమార్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ నాయకులు లక్ష్మీభాయి, హసీనా బేగం కూడా ఉన్నారు