రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పాల్వంచలోని NMDC కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస పనిదినాలు చూపించాలని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, CPI జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా అన్నారు. మంగళవారం NMDC అధికారులు M శ్రీధర్, D రాజు లతో కొత్వాల, సాబీర్ పాషా సమావేశమయ్యారు. గత 30 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో NMDC లో పనిచేస్తున్న 51 మంది కాంట్రాక్టు కార్మికులకు వేతన దినాలు సరిపోకపోవడాన్ని వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన అధికారులు కార్మికులకు నెలకు 10 పని దినాలు కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో NMDC అధికారులు శ్రీధర్, రాజు, INTUC కార్యదర్శి బానోత్ బాలు నాయక్, అధ్యక్షులు సకినాల కోటేశ్వరరావు, AITUC కార్యదర్శి అల్లి కాంతయ్య, మానిక్ చంద్, కాంగ్రెస్ నాయకులు దారా చిరంజీవి, పులి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.