calender_icon.png 25 January, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి..

24-01-2025 11:15:02 PM

ప్రొఫెసర్ ఎ. కోదండరాం.. 

అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎ. కోదండరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ‘విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు అధ్యాపకుల పాత్ర’ అనే అంశంపై రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల సదస్సు జేఏసీ చైర్మన్ ఉపేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎ. కోదండరాం, విద్యా కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ జి. హరగోపాల్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ... ఎన్నో ఏండ్లుగా ఒప్పంద ఉద్యోగులు రెగ్యూలర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.

యూనివర్సిటీల్లో అధ్యాపకులు కొరత ఉండదని, ప్రభుత్వం తక్షణమే విద్యాప్రమాణాలు పెంచాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ... యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత ఉందని, ప్రభుత్వం తక్షణమే అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యూజీసీ పే స్కేల్‌ను అమలు చేయాలని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయని పక్షంలో ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగ నోటిఫికేషన్‌లలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ వేల్పుల కుమార్, డాక్టర్ విజయేందర్ రెడ్డి, డాక్టర్ తాళ్లపల్లె వెంకటేశ్, కేయూ పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ సాదు రాజేష్, డాక్టర్ దత్తాత్రేయ, డాక్టర్ గంగ కిషన్, డాక్టర్ స్వప్న, డాక్టర్ రజని, కృష్ణవేణి, సూర్యం, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.