28-04-2025 05:35:05 PM
విద్యార్థుల సంఘీభావం...
కామారెడ్డి (విజయక్రాంతి): యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరవధిక సమ్మె సోమవారం 10వ రోజుకు చేరుకుంది. తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణ కాంట్రాక్ట్ అధ్యాపకులకు మద్దతుగా విద్యార్థులు సోమవారం సంఘీభావం తెలిపారు. గత పది రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంగణ కాంట్రాక్ట్ అధ్యాపకులను దక్షిణ ప్రాంగణంలోని వివిధ డిపార్ట్మెంట్ల విద్యార్థులు అధ్యాపకుల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ... తమ భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని, తమకు బోధన చేసే అధ్యాపకులు రోడ్డున నెట్టడాన్ని మంచిది కాదన్నారు, మండుటెండలకు సైతం లెక్కచేయకుండా సమస్యల కోసం పోరాడుతున్నారని వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని జ్ఞానాన్ని బోధించే అధ్యాపకులకు సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థి లోకం కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలపై పోరాడుతుందన్నారు.
ఈ నిరవధిక సమ్మెలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కమిటీ మెంబర్ డాక్టర్ నారాయణ గుప్తా, డాక్టర్ యాలాద్రి, సునీత మాట్లాడుతూ... విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ దేపాకులను రెగ్యులరైజ్ చేయాలని లేని పక్షంలో ఉద్యోగ భద్రత కల్పించి తమ సమస్యలు పరిష్కరించాలని, తాము గత 15, 20 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దామని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం మీన వేషాలు లెక్కపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ గ్లోబల్ సమీట్లో భాగంగా ఇచ్చిన పిలుపు న్యాయం మరియు సమానత్వంతో కూడిన సమాజం నిర్మించాలని పిలుపునిచ్చిన సందర్భంగా క్యాంపస్లో విద్యార్థులు మరియు అధ్యాపకులు ను రెగ్యులరైజ్ చేయాలని ఫ్లక్కాడ్లతో నిరసన తెలిపి, తమకు న్యాయం చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాలాద్రి, డాక్టర్ సునీత, డాక్టర్ రమాదేవి, డాక్టర్ సరిత, డాక్టర్ నరసయ్య, డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.