ఎస్టీయూటీఎస్ డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): సమగ్ర శిక్ష ఉద్యోగులు, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ల (సీఆర్టీ) సమ్మెను విరమింపచేసి, వారిని రెగ్యులరైజ్ చేయాలని ఎస్టీయూటీఎస్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం పర్వతరెడ్డి, జీ సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేర కు వారి సమస్యలపై చర్చించి ప్రభు త్వం సానుకూలంగా స్పందించాలని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు దశాబ్దాలుగా ఉద్యోగ భద్రత లేకుండా అనేక సమస్యలతో సీఆర్టీలు ఇబ్బందులు పడుతున్నారని, మినిమం బేసిక్ పే విధానాన్ని వారికి అమలు చేయాలని కోరారు.