calender_icon.png 23 April, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగో రోజుకు కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల సమ్మె

23-04-2025 12:00:00 AM

ఓయూ మాజీ వైస్ ఛాన్స్‌లర్ మద్దతు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని యూనివర్సి టీలలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన సమ్మె మంగళవారం నాలుగో రోజుకు చేరింది. ఓయూ పరిపాలన భవనం ఎదుట నిరసన తెలుపుతున్న మహిళా అధ్యాపకులను సెక్యూరిటీ సిబ్బంది పంపించే ప్రయ త్నం చేశారు.

అయినా నిరసన కొనసాగింది. ఉస్మానియా యూనివర్సిటీ, వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంగళవారం ఇంజనీరింగ్ కాలే జీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు ర్యాలీగా వెళ్లి టెంటు కింద కూర్చొని సమ్మెను కొనసాగించారు.

వారికి ఓయూ మాజీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ మద్దతు తెలిపారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని, యూనివర్సిటీ అధికారులను డిమాండ్ చేశారు.  కాకతీయ యూనివర్సిటీలో జరిగిన నిరసనలో మాజీ ఎంపీ, ప్రొఫెసర్ సీతారాంనాయక్ పాల్గొని మద్దతు తెలిపారు.

మరో పక్క పార్ట్ టైం అధ్యాపకులు కేయూ పరిపాలన భవనం ద్వారం వద్ద బైఠాయించారు. శ్రమదోపిడీకి గురవుతున్న పార్ట్ టైం అధ్యాపకుల కు న్యాయం చేయాలని కోరారు. శాత వాహ న యూనివర్సిటీలో కాంట్రాక్ట్ పార్ట్ టైం అ ధ్యాపకులు కలిసి నిరసన తెలిపారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ, అంబేడ్కర్ యూ నివర్సిటీ, బాసర త్రిబుల్ ఐటీ, మహబూబాబాద్ పీజీ సెంటర్‌లో సమ్మె కొనసాగింది.