calender_icon.png 16 January, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంట్రాక్టు ప్రొఫెసర్లు కావలెను

08-08-2024 01:38:22 AM

  1. ఉస్మానియా, గాంధీలో నియామక ప్రకటన
  2. ఉస్మానియాలో 175, గాంధీలో 60 మంది 
  3. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్..
  4. అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులు

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో 235 మంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిలో ని యమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల బదిలీల అనంతరం ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో ఖాళీ అయిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, రెసిడెంట్ డాక్టర్ల నియామకం కోసం బుధవారం నో టిఫికేషన్ జారీ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

ఈ నియామకాలను ఇంటర్వ్యూ ద్వారా పూ ర్తి చేయనున్నారు. గాంధీ దవాఖాన నియామకాలకు ఈ నెల 9న ఉదయం 10.30 గంటలకు గాంధీ మెడికల్ కాలేజీ పరిపాలన భవనంలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సమక్షంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. అదే సమయంలో ఉస్మానియా  దవాఖాన నియామకాలకు ఉస్మానియా మెడికల్ కాలేజీ అకడమిక్ బ్లాక్‌లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ సమక్షంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ నియామకా లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.